అమ్మాయికి పెళ్ళి కాలేదని పెద్దలు బాధ పడుతుంటారు. మొదటగా అవివాహిత గదిలో ఒంటరిగా ఉన్న ఫోటోలు లేదా పెయింటింగ్‌లను తొలగించండని, ఆ గదిలో ఆరు లేదా ఎనిమిది రాడ్‌లు ఉన్న విండ్‌చైమ్స్‌లను లేదా క్రిస్టల్‌లను ఉంచండని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. తెలుపు లేదా పింక్ కలర్ క్యాండిల్ ఉంచండని, పెళ్ళికి సంబంధించిన వస్తువు పూలగుత్తి ఉన్న పెయింటింగ్ ముఖ్యంగా ఇది ఆడవారి అదృష్టానికి చిహ్నంమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
కాగా పెళ్ళికాని అమ్మాయిలు ఈ కింది విధంగా చేసుకోవడం ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. పెళ్ళికాని అమ్మాయితాలుకు తల్లి తమ కూతుళ్ళ హాల్లో లేదా లివింగ్‌రూమ్‌లో నైరుతి వైపు అందమైన పూలగుత్తులను ఉంచితే పెళ్ళికుదిరే అవకాశం ఉందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
అదే అమ్మాయి ఒక్కటే ఉన్నట్లయితే, దూరంగా చదువుతున్నట్లయితే అప్పుడు ఆ అమ్మాయి తన బెడ్‌రూమ్ బయట తలపుకి ఈ పులగుత్తుల పెయింటింగ్‌ని ఉంచితే చక్కని భర్త లభిస్తాడని, పూలగుత్తుల పెయింటింగ్ బెడ్‌రూమ్ లోపల కూడా ఉంచవచ్చు, కాని బెడ్‌రూమ్ బయట ఉంచితే ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
పెళ్ళయిన అమ్మాయి అయితే, పూలగుత్తి ఉన్న పెయింటింగ్‌ని హాల్లో లేదా లివింగ్ రూమ్‌లో ఉంచండని, అందువల్ల భార్య భర్తల సంబంధాలు దృడపడతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అంతేకాని పొరపాటున దానిని బెడ్‌రూమ్‌లో పెట్టకండని, అందువల్ల మీ భర్త పరస్త్రీల వెంటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
పూలగుత్తి ఉన్న పెయింటింగ్ ఆకృతి ఉంచే చోటు సువాసనలు వెదజల్లేటట్లుగా ఉండాలి. వాస్తవానికి పెయింటింగ్ బదులుగా పూలగుత్తి లభిస్తే వాటినే ఉంచవచ్చునని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. తాజా గులాబీలు లేదా మల్లెపువ్వులు పుష్పగుచ్ఛాన్ని ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. పాత పుష్పాలను వాడిన వెంటనే తీసేస్తూ, కొత్త పువ్వులను అమర్చడం ఉత్తమమని ఫెంగ్‌షుయ్ అంటోంది.