ఆగిపోయిన, పనిచెయ్యని గడియారాలను ఇంట్లో వుంచకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో శుభకరమైన శక్తిని నింపడానికి గడియారాలనే ఫెంగ్‌షుయ్ నిపుణులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే..? గడియారంలో ముళ్ళు లేదా పెండ్యూలయం లయబద్ధంగా కదులుతూ.. చీ శక్తిని ఇంటి నిండా నింపుతుందని చైనా ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
అలాంటి గడియారాలను మీ ఇంటి హాలుకు ఎడమవైపు లేదా ముందుగోడకి తగిలించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అయితే గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉంచకూడదని వారు చెబుతున్నారు.
అలాగే పెళ్ళిళ్లకు, ఇతర వేడుకల్లో గడియారాలను బహుమతిగా ఇస్తుండటం పరిపాటి. కాని గడియారాలను బహుమతిగా స్వీకరించడమో లేదా బహుమతిగా ఇవ్వడమే కూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడియారాలను బహుమతి తీసుకోవడం, ఇవ్వడం ద్వారా అశుభ ఫలితాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు.
అందుచేత గడియారాలను మీరు స్వయంగా కొనుక్కొని ఇంట్లో ఉంచుకోండి. ఇతరులు గడియారాలను బహుమతిగా ఇస్తే సున్నితంగా వారించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.