Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2016కి కలిసొచ్చే ఫెంగ్ షుయ్ రంగుల్తో ఇంటిని అలంకరించండి!

Advertiesment
Home Decor
, శనివారం, 19 డిశెంబరు 2015 (17:25 IST)
2016 కొత్త సంవత్సరంలో మంచే జరగాలనుకుంటున్నారా..? కొత్త సంవత్సరం మనకు అన్నీ శుభాలను ప్రసాదించాలని ఆశిస్తున్నారా? అయితే ఫెంగ్ షుయ్ చెప్తున్న కొన్ని రంగులతో ఇంటిని అలంకరించుకోండి. ఇంటికి పెయింటింగ్‌ చేయకపోయినా.. ఇంట్లో ఉపయోగించే వస్తువుల్ని ఆ రంగులో ఎంచుకోండి అంటున్నారు ఫెంగ్ షుయ్ నిపుణులు. 
 
2016కు ఫెంగ్ షుయ్ ప్రకారం ఆంగ్లంలో సాఫ్ట్ పింక్ (soft pink), పేల్ బ్లూ (Pale blue) వంటి రంగులు పాజిటివ్ శక్తులను అందిస్తుంది. అంతేగాకుండా పాజిటివ్ ఎనర్జీని మీ ఇంటికి ఆహ్వానిస్తుంది. సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. మానసిక ఉల్లాసాన్నిస్తుంది. ఒత్తిడిని పారద్రోలుతుంది. నీలం, రోజా పువ్వు రంగుల్లో లేతవి అనుకున్న కార్యాలను దిగ్విజయం చేస్తాయని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. 
 
అలాగే పురుషులు నీలం రంగులు, మహిళలు గులాబీ రంగుల్ని ఎంచుకోవాలి. ఇంకా ఈ రంగుల్లో ఉండే వస్తువులను ఇంటి అలంకరణకు ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు లైట్ పింక్‌, లైట్ బ్లూతో కూడిన లైట్ ల్యాంపులను ఉపయోగించవచ్చు. పిల్లో కవర్లు, సోఫా కవర్లు, బెడ్ కవర్లు కూడా ఈ రంగులో ఉంటే మంచిది. ఇక పిల్లల స్కూల్ లంచ్ బ్యాగులు, షాపులకు తీసుకెళ్లే బ్యాగులు లేత పింక్, లేత బ్లూ కలర్లో ఉంటే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. ఫ్లవర్ వాజ్‌లు కూడా లేత గులాబీ, నీలం రంగుల్లో ఉంటే కొత్త ఏడాదిలో శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu