ఫెంగ్‌షుయ్ ప్రకారం షూస్ బయటే పెట్టాలి. ఆరోగ్య రీత్యా షూస్‌ను ఇంటి బయటే ఉండటం ఒకింత మేలే. అయితే కొందరు అపార్ట్‌మెంట్లు, అద్దె ఇంట్లో ఉంటూ చోటు లేక షూస్ అలమరాను ఇంట బయట పెట్టకుండా ఎంట్రన్స్‌లో పెడుతుంటారు. తద్వారా ఆరోగ్యానికి కీడు జరగడమే కాకుండా.. ఇంటికి అశుభ ఫలితాలనిస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
షూస్‌ను ఇంట్లో పెట్టడం ద్వారా చెడు ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుందని.. తద్వారా అనారోగ్యాలతో పాటు ఇంటి వాతావరణం కూడా అశుభప్రదంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. షూస్‌ను ఇంట్లో వుంచడం ద్వారా వాణిజ్య రీత్యా ఊహించని ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోకి వచ్చే మంచి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.
అలాగే ఇంట్లో లివింగ్ రూమ్‌ను సోఫాలతో నింపేయకుండా పరిమితంగా ఉంచుకోవాలి. నడకకు వీలుగా స్థలం ఉండాలి. ఇంట్లో నడకకు అనువైన స్థలం ఉండటం ద్వారా గాలి, వెలుతురుని ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది. తద్వారా ఒత్తిడి దూరమై.. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.