Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈశాన్య దిక్కులో వృక్షాలుంటే పురుషులకు హానికరమా?

Advertiesment
ఈశాన్య దిక్కులో వృక్షాలుంటే పురుషులకు హానికరమా?
, సోమవారం, 10 నవంబరు 2014 (15:35 IST)
సాధారణంగా ఇంటికి ఈశాన్య దిక్కులో చాలామంది చిన్నపాటి చెట్లను, పూలకుండీలను పెంచుతుంటారు. అయితే భారీ వృక్షాలు ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. ముఖ్యంగా ఈ దిశలో వృక్షాలు ఉంటే ఇంటిలోని పురుషుల ఆరోగ్యానికి హానికరమని ఈ శాస్త్రం చెపుతోంది. కానీ నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. 
 
కాబట్టి పై రెండు దిశల్లో వృక్షాలు మీ ఇంటి బయటి స్థలానికి దగ్గరగా ఉన్నా ఫలితాలు పైవిధంగానే ఉన్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. దుష్ఫలితాలు కలిగించగల ఏ దిశలో చెట్టున్నా దాని వైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మామూలు అద్దం పెట్టడం శ్రేయస్కరం.
 
కానీ మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదు అన్న అనుమానం వద్దు. ఇంట్లో మొక్కలు పెంచడం ఇంట్లో దోషమున్న చోట ఆక్సిజన్ నింపడమే. దోషంలోని విషవాయువును లేదా కార్బన్-డై-ఆక్సైడ్‌ అవి పీల్చుకుంటాయి. అలాగే ఒక దిశలో మొక్కలు పెంచితే ఆ దిశకు సంబంధించిన రంగు బల్బు పెట్టడం మరిచిపోకూడదు. 
 
ఇలా చేయడం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియకు కావాల్సిన వెలుతురును బల్బు ద్వారా మనం ఇస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. అందుకే కనీసం 21 రోజులయినా 24 గంటలూ బల్బులు వెలిగించి ఉంచాలన్న నియమం పెట్టారని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu