Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెయింట్ కొడుతున్నారా? అయితే నలుపు రంగు వాడొద్దు!

Advertiesment
పెయింట్ కొడుతున్నారా? అయితే నలుపు రంగు వాడొద్దు!
, శనివారం, 31 మే 2014 (13:29 IST)
మీ గృహానికి పెయింట్ కొడుతున్నారా..? అయితే నలుపు రంగును ఎక్కడా వాడకండని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. నలుపు రంగు నీటికి చిహ్నం అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా వాడకూడదని వారు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఇంటి పైకప్పుల మీద, దూలాలకు ఈ రంగును పొరబాటున కూడా వాడకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇంకా నలుపు రంగును గృహానికి వేయించే పెయింట్‌లో ఎక్కడా వాడకుండా ఉండటమే మంచిది.
 
కానీ దూలాలకు, పైకప్పులకు తెలుపు రంగును వాడటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే గృహంలో పడమర దిక్కున తెలుపు రంగుతో కూడిన పోస్టర్లును తగిలిస్తే కుటుంబ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. 
 
ఇక ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను మీ గృహంలోని దక్షిణ, ఆగ్నేయ, ఈశాన్య దిశల్లో ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. ఇందులో ఎరుపు రంగు దక్షిణానికి చిహ్నం. ఇంకా రాబడికి ప్రతి రూపం ఇది. అందువల్ల దక్షిణం వైపు ఎరుపు రంగు పోస్టర్లు, కర్టెన్‌లు, కార్పెట్‌లు వుంచితే లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. 
 
ఆగ్నేయానికి చిహ్నం అయిన ఆకుపచ్చ రంగు సంపదకి ప్రతిరూపం. ఇదే రంగు తూర్పువైపు కూడా వేయిస్తే శుభఫలితాలుంటాయి. అందువల్ల రంగు రంగుల పూల మొక్కల కుండీలను ఆగ్నేయ, తూర్పు దిశల్లో వుంచడం ద్వారా సంపద పెరుగుతుంది. ఇకపోతే.. నీలం రంగును ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు ఉంచడం వల్ల మంచి ఫలికాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu