Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహం కోసం ఫెంగ్‌షూయ్

Advertiesment
పెళ్లి వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి కాలేదని విచారపడుతున్నారా ? అయితే ఫెంగ్‌షూయ్ సూత్రాలను పాటించండి. మీ ఇంట్లోకి సుఖ
, బుధవారం, 2 ఏప్రియల్ 2008 (17:36 IST)
పెళ్లి వయసు వచ్చిన మీ అమ్మాయికి పెళ్లి కాలేదని విచారపడుతున్నారా ? అయితే ఫెంగ్‌షూయ్ సూత్రాలను పాటించండి. మీ ఇంట్లోకి సుఖ, సంతోషాలను ఆహ్వానించండి. వీటిని నియమ నిష్టలతో పాటించి చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది.

ముందుగా చేయవలసింది ఏమిటంటే వివాహం కాని అమ్మాయి గదిలో ఏవైనా ఒంటరిగా ఉన్న అమ్మాయి లేదా ప్రాణుల ఫొటోలు ఉంటే వాటిని తీసేయండి. ఆ గదిలో క్రిస్టల్స్ వంటి వాటిని ఉంచండి. అలాగే తెలుపు లేదా పింక్ రంగులలో ఉండే క్యాండిల్స్‌ను అమరిస్తే ఇంకా మంచిది.

అలాగే పూలగుత్తులు ఉన్న పెయింటింగ్స్‌ను అమ్మాయి గదిలో లేక లివింగ్ రూంలో నైరుతి వైపు ఉంచితే పెళ్లిళ్లు త్వరగా కుదిరే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయి మాత్రమే ఆ ఇంటిలో ఉంటున్నట్టైతే గది బయట ఉంచితే మంచిది. మీ పడక గదిలో ఉంచుకోవచ్చు. కానీ బయట ఉంచితే ఇంకా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఒక వేళ మీరు వివాహిత అయితే ఈ పెయింటింగ్స్‌ను హాలులో పెట్టుకోవచ్చు. కానీ పడకగదిలో మాత్రం పెట్టుకోకపోవడమే మంచిది. అలా పెడితే ఇతర స్త్రీల వెనుక మీ వారు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పెయింటింగ్స్ పెట్టిన చోట నిజంగానే సువాసనలు పెడితే చాలా బావుంటుంది.

అయితే వీటన్నిటి కంటే కూడా మీరు నిజమైన పూలగుత్తులు పెడితే అందంతో పాటు మీకు శుభం కూడా జరుగుతుంది. వివిధ రకాల రోజాలు, లిల్లీలు తదితర పూలగుత్తులను పెడితే అందంగా ఉంటాయి. అలాగే మల్లెలు, సంపంగిలు, లిల్లీలను పెట్టండి. రోజూ వీటిని మార్చడం తప్పనిసరి.

Share this Story:

Follow Webdunia telugu