Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజిటింగ్ కార్డును ఎలా ముద్రిస్తున్నారు?

Advertiesment
విజిటింగ్ కార్డు ముద్రణ బిజినెస్
మీ పర్సనల్ లేదా బిజినెస్ విజిటింగ్ కార్డును ప్రింట్ చేయించుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే మీ సంపద, బిజినెస్ రెట్టింపు అవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

* మీ కార్డు చిహ్నం లేగా లోగో ఎప్పుడు కొనతేలెటట్లుగా ఉండకూడదు. ఇలా ఉంటే వ్యాపారాభివృద్ధి మందగిస్తుంది.

* మీ కార్డుమీద అక్షరాలు ఎప్పుడు లోగో మీదకు వచ్చేటట్లుగా డిజైన్ చేయకూడదు. గుండ్రటి, దీర్ఘచతురస్రాకారపు ఆకారాలను ఎన్నుకోవడం మంచిది.

* మీ కార్డు కోసం ఏ రెండు రంగులు వాడినా అవి ఒకదానికొకటి సరితూగునట్లుగా ఉండాలి. నిజానికి మంచి రంగుల కలయికలు అంటే.. పచ్చ- నలుపు, బ్రౌన్ నలుపు, నీలం- నలుపు మొగదలగునవి. అయితే నలుపు-ఆరెంజ్, నలుపు-పసుపు పచ్చ వంటి అభిలషణీయం కాని రంగులను విజిటింగ్ కార్డుల కోసం ఎంపిక చేసుకోవడం మంచిది కాదు.

ఇకపోతే.. మీ కార్డు సైజుకి ఒక వైపున 5 సెంటీమీటర్లు (అంగుళాలు)కు మించకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu