Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రివేళ ఉతికేసిన బట్టలు అతీతశక్తులను ఆకర్షిస్తాయట!

Advertiesment
రాత్రివేళ ఉతికేసిన బట్టలు అతీతశక్తులను ఆకర్షిస్తాయట!
, శుక్రవారం, 18 మే 2012 (18:03 IST)
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం గాలి, వెలుతురు, నీరు ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యం. అందుకే ఇంట్లో పనికిరాని వస్తువుల్ని తీసి బయట పారేయాలనేది ఫెంగ్‌షుయ్‌లో ప్రథమ సూత్రం.

ఇదే వరస క్రమంలో మనం వేసుకునే దుస్తులు నీట్‌గా, చక్కగా ఉతికినవై ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వేసుకునే డ్రస్‌ని బట్టి అతని ప్రవర్తనని తేలిగ్గా చెప్పేయొచ్చు. ఇటీవల ఆధునిక కాలంలో చాలామంది ఫ్యాషన్ల పేరుతో చొక్కా, ఫ్యాంట్‌ల మధ్యలో రంధ్రాలు వుంచుకుని తిరుగుతున్నారు. అలాంటివి దారిద్ర్యానికి చిహ్నమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

రాత్రిపూట బట్టలు ఉతికేయవద్దని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. అలా రాత్రివేళ ఉతికి ఆరేసిన బట్టలు దయ్యాలను, అతీతశక్తులను ఆకర్షిస్తాయని చైనీయుల నమ్మకం. కొంతమంది అర్జెంటుగా రాత్రి రాత్రే బట్టలు ఉతికి బయట ఆరేస్తారు. అలాంటి పని మానుకోమని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది.

అలాగే మీరు ఆఫీసు నుండి రాగానే బద్ధకం వదిలించుకుని బట్టలు తీసేసి వేరే బట్టలు వేసుకోండి. ఎప్పుడూ చూసిన కడిగిన ముత్యంలా కన్పించే వారి ఇంటికే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఉదయం లేవగానే నైట్ డ్రెస్‌ని అవతర పారేసి మీ సహజ డ్రస్సులోకి మారండి.

Share this Story:

Follow Webdunia telugu