మీ జీవితంలో, కెరీర్‌లో విజయం సాధించాలనుకుంటున్నారా? విజయానికి చాలా ముఖ్యమైనవి శ్రమ, పట్టుదల, ఓర్పు అని మనకు తెలిసిన విషయమే. వీటితో పాటు అదృష్టం కూడా ఉండాలని మన పెద్దలంటుంటారు. అయితే ఈ అదృష్టం ఎలా వస్తుంది. ఫెంగ్‌ష్యూయ్ నియమాలను పాటించి చూడండి.
మీ డెస్క్‌పై ఆగ్నేయం దిశలో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే ఓ అందమైన చిన్న మొక్కను పెట్టండి. ఇది మీ విజయానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. అంతే కాకుండా చక్కని ఆదాయానికి కూడా సహాయపడుతుంది. అలాగే మీ టేబుల్‌పై తూర్పు వైపుగా పువ్వుల గుత్తును పెట్టుకోండి. అందమైన రోజాలు, లిల్లీలు తదితరాలను పెడితే మరీ బావుంటుంది.
అయితే వీటిని రోజూ మారుస్తూ ఉండాలి సుమా. ఫ్లవర్ వాజ్ రొటీన్ కాబట్టి వెరైటీగా పువ్వుల గుత్తును అందంగా అలంకరించి పెట్టుకోండి. మీ డెస్క్‌టాప్‌పై లైట్ ఉండేలా చూసుకోండి. ఆఫీసులో మీ విజయానికి ఇది నాందిగా నిలుస్తుంది. వ్యాపార రంగంలో మీకు పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి.
ఇంతే కాకుండా మీ టేబుల్‌పై నైరుతి దిశలో గుండ్రమైన స్పటికాన్ని పెట్టడం ద్వారా ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాదు ప్రస్తుతం మీకున్న సంబంధాలు ఇంకా మెరుగవుతాయి. కొత్తవారితో ఏర్పడే పరిచయాలు మీ అభివృద్ధికి తోడ్పడతాయి.