Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ గృహంలో పూజగది ఏ దిశలో ఉంది..?

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి ఫెంగ్షుయ్ భగవంతుడు ఫెంగ్షుయ్ చిత్రపటం విగ్రహం సిరిసంపదలు
భగవంతుడు సృష్టికి మూలాధారం. అలాంటి భగవంతుడిని గృహంలో సరైన దిశలో అమర్చి పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని శాస్త్ర వచనం. ఫెంగ్‌షుయ్ సూత్రాలను బట్టి భగవంతుడి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని హాలు ప్రవేశ ద్వారం ఎదురుగా ఉంచడం ద్వారా ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

హాలు ప్రవేశ ద్వారం ఎదురుగా దేవుడి పటాన్ని ఉంచడం ద్వారా... గృహంలోకి ప్రవేశించగానే భగవంతుడిని చూస్తాం. దీనిద్వారా కార్యాచరణ విజయవంతం కావడం, శుభకార్యాలు జరగడం వంటివి జరుగుతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

హాలులో కుదరని పక్షంలో దేవుడు పటాన్ని నైరుతి వైపు ఉంచవచ్చు. అయితే... నైరుతి వైపు ఉంచే భగవంతుడి విగ్రహంపై ఎలాంటి దూలాలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే పూజగది ఉన్న చోట, పై అంతస్తులో టాయ్‌లెట్ ఉండకూడదు. ఇలా ఉంటే అశుభాలు జరుగుతాయని ఫెంగ్‌షుయ్ అంటోంది.

ఇకపోతే... మెట్ల కింద గానీ, మెట్లకు ఎదురుగా గానీ దేవుడి పటాన్ని ఉంచకూడదు. భగవంతుడు ఉన్న స్థలాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. అక్కడ కాలిపోయిన అగరవత్తుల పొడిగాని, నూనె వలికి పోయిన మరకలు, కాల్చి పారేసిన అగ్గిపుల్లలు వంటివి లేకుండా శుభ్రంగా కడిగి ఉంచాలి. ప్రతి నిత్యం పూజలు చేస్తూ ఉండాలి.

పూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణధృవ శక్తి నిలయాలుగా మారిపోయి ఆ ఇంటివారికి హాని చేస్తాయి. ఇక భగవంతునికి చేసే ప్రార్థన విషయానికి వస్తే... తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. ఒకవేళ తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం కుదరకపోతే ఉత్తరంవైపు తిరిగి చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ గాయత్రి మంత్రాన్ని పఠించాలి. లేదా ప్రతినిత్యం మీ గృహంలో టేప్ రికార్డ్‌ల్లో దేవుడి పాటలను వినండి.

ఇంకా చెప్పాలంటే... ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగదిని నిర్మించటానికి వీలులేనప్పుడు గోడలో ఓ అలమరాను చేయించి అందులో భగవంతుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి పూజ చేసుకోవచ్చు. ఒకే గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu