సాధారణంగా విండ్చిమ్ కదలినప్పుడు వాటినుండి వెలువడే శబ్దం ఆహ్లాదకరంగా, శ్రవ్యమైన సంగీతాని వింటున్నంత అనుభూతిని ఇవ్వగలిగేటట్లు ఉండాలని, వినసొంపుకాని శబ్దం చేసేలా ఉండకుడదని ఫెంగ్షుయ్ చెబుతోంది. విండ్చిమ్ను ఎంచుకునే ముందు దానిని నెమ్మదిగా తాకి చూడాలని, వాటిద్వారా వెలువడు శబ్దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఫెంగ్షుయ్ వెల్లడిస్తోంది.
ఆ శబ్దం వల్ల మీకు చక్కటి ఫీలింగ్ కలిగితేనే అది మంచిదని గుర్తించాలని ఫెంగ్షుయ్ చెబుతోంది. అలా వెలువడు శబ్దం మంచిదిగా అనిపించినప్పుడు విండ్చిమ్ను ఉంచాల్సిన చోటు, దిశల ప్రకారం రెండు మూడు ప్రదేశాలకు మార్చి చూడండని, ఈ విధమైన స్థల మార్పిడిలు దాదాపు 21 రోజుల కొకసారి చేసి చూడండని ఫెంగ్షుయ్ వెల్లడిస్తోంది. కొన్ని నెలల తర్వాత మీ కుటుంబ సభ్యులకు విండ్చిమ్ శబ్దం నచ్చకపోతే దానిని పక్కన పెట్టి, కొత్తవి కొనుక్కోవడం ఉత్తమమని ఫెంగ్షుయ్ తెలుపుతోంది.