ఫెంగ్‌షుయ్ : ఆకాశంలో రాత్రి పూట అరుంధతిని చూస్తే?
ఫెంగ్‌షుయ్ ప్రకారం మీ పిల్లల గదుల్లో పసుపుపచ్చ రంగుకొట్టొచ్చినట్లుగా ఉండడం వారి అనారోగ్యానికి దారి తీస్తుంది. రోజూ నిద్రలేవగానే స్ఫటికంలోకి చూడండి. అది అన్ని విధాలా మిమ్ముల్ని సంరక్షిస్తుందని మనసులో ఒకమారు అనుకోండి. ఇలా రెండు, మూడు నెలలు తప్పనిసరిగా అనుకుంటే మీకున్న చాలా మట్టుకు సమస్యలు దూరమవుతాయి. రోజూ రాత్రి పడుకునే అర్థగంట ముందు ఆకాశంలోని ఒక నక్షత్రాన్ని చూస్తూ ఉండండి. క్రమం తప్పకుండా దానినే చూస్తూ ఉండడం వల్ల దానికి గల కొన్ని కాస్మిక్ శక్తుల ప్రభావం మిమ్ముల్ని ఎన్నో విధాలా రక్షించగలదు. ఈ తారలేదా తారల కూటమి మీ నక్షత్రానికి లేదా రాశికి పొడుగునా కనపడవు. అలాంటప్పుడు ఎప్పుడూ కనబడే సప్తర్షి మండలము, అరుంధతి నక్షత్రం లాంటివి చూడాలి. పదిహేను రోజుల కొకసారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లేదా హిందూ లాంటి పత్రికలు చూసేవారికి ఏవేవి ఎప్పుడు కనిపించగలవో ఒక సంవత్సరంలోపు అన్ని విధాలా తెలుస్తాయి.