పడక గదిలో ఎలాంటి బెడ్ షీట్‌లను వాడాలి?
, గురువారం, 8 మే 2014 (19:30 IST)
మీరు పడక గదిలో ఎలాంటి బెడ్ షీట్‌లను వాడుతున్నారా? కాస్త ఆగండి. ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి బెడ్‌షీట్‌లను వాడరాదంటున్నారు. ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం. అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్‌రూమ్‌లో తెల్లని బెడ్‌షీట్‌లకు వాడకూడదట. బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదని చెపుతున్నారు. అలాగే మీ పడకగదిలో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు అక్వేరియం, ఫౌంటెన్‌లాంటివి ఉంచరాదని చెపుతున్నారు. ఎందుకంటే అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి రాత్రులకు దారితీస్తాయట. బెడ్‌రూమ్‌లో పెళ్లైన దంపతులున్న పెయింటింగ్‌లను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.