Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతిథులకు "హాలు" స్వాగతం పలకాలి

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి ఫెంగ్షుయ్ గృహం అతిథులకు స్వాగతం చూడముచ్చట వెలుగులు కాంతి పెయింటింగ్ కర్టెన్
, మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (15:33 IST)
గృహంలోని హాలు ఎప్పుడూ అతిథులకు స్వాగతం పలికేలా చూడముచ్చటగా ఉండాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఏ అతిథైనా మొదట మన గృహంలోకి రావాలంటే ముందుగా హాల్లోకి రావాల్సిందేనన్న విషయం తెలిసిందే. కాబట్టి హాలు లేదా ఇంట్లోకి ప్రవేశించే మొదటి గది ఎప్పుడూ ఇతరులకు ఆహ్వానం పలికేలా, సౌకర్యంగా, వెలుగులు చిమ్ముతూ ఉండాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

గోడలకు చక్కని పెయింటింగ్‌లతో, కిటికీలకు చక్కటి కర్టెన్‌లతో హాలు చూడముచ్చటగా అనిపించి అతిథులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు. హాలుకు నలువైపుల చివర్లను లైట్లతో లేదా మొక్కలతో, పుష్పాలతో కాంతి వంతం చేయడం ద్వారా ఆ గృహం అతిథులను ఆహ్వానించడంతో పాటు అష్టైశ్వరాలకు నిలయమవుతుందని వారు చెబుతున్నారు.

హాల్లో వేసిన కుర్చీలు ఒక గుండ్రటి ఆకారంలో ఉంటే బాగుంటుందని, ప్రతి సోఫా కుర్చీకి వెనుక వీపు ఆనుకునేట్లుగా సపోర్ట్ ఉండాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అయితే ఎల్-ఆకారపు ఏర్పాట్లను హాల్లో ఉంచకూడదని ఆ శాస్త్రం వెల్లడిస్తోంది. అదే విధంగా ఎండిపోయిన మొక్కల్ని హాలు ఉంచడం చెడు ఫలితాలనిస్తుంది. వాడిన పువ్వులను ఫ్లవర్ వాజ్‌ల నుంచి అప్పటి కప్పుడు తొలగిస్తూ, తాజా పూవులతో అలంకరించడం ద్వారా యజమానులకు సుఖసంతోషాలు చేరువవుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu