బ్రెడ్ పనీర్ రోల్స్ ఎలా చేయాలో మీకు తెలుసా?
పాఠశాలల నుంచి వచ్చే పిల్లలకు, ఆఫీసుల నుంచి వచ్చే పెద్దలకు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే బ్రెడ్ పనీర్ రోల్స్ ట్రై చేయండి. ఎప్పుడూ ఉప్మా, దోసెలతో బోర్ కొట్టకుండా వెరైటీగా బ్రెడ్ పనీర్ రోల్స్ సర్వ్ చేయండి. కావలసిన పదార్థాలు :బ్రెడ్ ముక్కలు - ఐదు పనీర్ - తగినంత పచ్చిమిర్చి - 2 కొత్తిమీర - కాసింత మిరియాల పొడి - అర స్పూన్టమోటా తరుగు - పావు కప్పుఉప్పు, నూనె - తగినంత తయారీ విధానం : ముందుగా బ్రెడ్ ముక్కల చివర్లను కట్ చేసి పక్కన బెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి పచ్చిమిర్చి, టమోటా, మిరియాల పొడి, ఉప్పు, పనీర్ తురుమును చేర్చి బాగా వేపుకుని పాత్రలోకి తీసుకోవాలి. మరో పాత్రలో తగినంత నీరు పోసి బ్రెడ్ ముక్కల్ని చేతిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ మిశ్రమాన్ని ఓ ప్లేటులోకి తీసుకుని అందులో పనీర్ మిశ్రమాన్ని మధ్యలో ఉంచి.. మెల్లగా రోల్స్‌లా చేసి నూనెలో దోరగా ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పనీర్ రోల్ రెడీ అయినట్లే. వీటిని మీకు నచ్చిన చట్నీతో గానీ, సాస్‌తో హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.