ఫ్రెండ్‌షిప్ పరోటా ఎలా ఉంటుందో టేస్ట్ చేశారా?
, గురువారం, 1 ఆగస్టు 2013 (17:17 IST)
ఆగస్టు వచ్చేసింది.. ఆగస్టు మాసం మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే వచ్చేస్తోంది. మరి మీ స్నేహితులకు కానుకలు ఇచ్చేందుకు రెడీ అవుతుంటారు అలాగే ఫ్రెండ్‌షిప్ డే రోజు ఫ్రెండ్‌షిప్ పరోటా ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు : గోధుమ పండి : రెండు కప్పుల నెయ్యి - పావు కప్పు ఉప్పు తగినంత పూర్ణానికి.. ఉడికించిన పచ్చి బఠాణీలు - అరకప్పు పచ్చిమిర్చి - 1అల్లం పేస్ట్ - ఒక స్పూన్ జీలకర్ర - ఒక స్పూన్ఉప్పు - తగినంత కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లుబటర్ - కాసింత బటర్ మినహా పూర్ణానికి చెప్పిన పదార్థాలన్నింటిని రుబ్బుకుని.. కాసింత వెన్నలో లేతగా వేపుకుని ఉండలు చేసుకుని పక్కన బెట్టుకోవాలి. రెండో పూర్ణానికి.. కేరట్ తురుము - అర కప్పు ఎండు మిర్చి - 1 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్ ఉప్పు - తగినంతజీలకర్ర - అర టీ స్పూన్ బటర్ - కాసింత క్యారట్‌తో పాటు పైన చెప్పినవన్నింటిని పేస్ట్‌లా చేసుకుని వెన్నలో వేపుకుని ఉండలు చేసుకోవాలి. తయారీ విధానం : గోధుమ పిండిలో రెండు టీస్పూన్లు నెయ్యి, ఉప్పు, నీటిని చేర్చి చపాతీలకు తగ్గట్టు కలుపుకుని పెట్టుకోవాలి. చపాతీల్లా రుద్దుకుని తొలి, రెండు పూర్ణాలను అందులో ఉంచి బయటికి రానట్లు మళ్లీ రుద్దుకోవాలి. తర్వాత పెనం వేడయ్యాక పూర్ణాలతో రుద్దిన చపాతీలను మితమైన వేడిపై ఇరు పక్కన ఉడికించి.. పెరుగు పచ్చడితో సర్వ్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్‌షిప్ పరోటాలు రెడీ అయినట్లే.