ఫిష్ కట్లెట్: వీకెండ్లో ట్రై చేయండి
వీకెండ్లో పిల్లలకు నచ్చిన విధంగా నాన్ వెజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఫిష్ కట్ లెట్ ట్రై చేయండి.. చేపల కూర, ఫ్రైలతో సరిపెట్టుకోకుండా ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌గా కూడా ఫిష్ కట్ లెట్ ట్రై చేయవచ్చు.కావలసిన పదార్థాలు:చేపలు : అరకేజీబంగాళాదుంపలు : రెండు ఉల్లిపాయ తరుగు : అరకప్పు, పచ్చి మిర్చి : ఐదుజీలకర్ర పొడి : అర టీ స్పూన్ మిరప్పొడి : అర టీ స్పూన్మిరియాల పొడి : అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీ స్పూన్ రస్క్ : నాలుగుకోడిగుడ్లు : నాలుగు నిమ్మరసం : అర టీ స్పూన్ ఉప్పు, నూనె: తగినంతతయారీ విధానం:ముందుగా చేపలు, బంగాళాదుంపల్ని ఉడికించి మెత్తగా చేసి పక్కనబెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కాసింత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దోరగా వేపుకుని ఉడికించి మెత్తగా చేసుకున్న చేపలు, బంగాళాదుంపల మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో మిరప పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్డులోని తెల్లసొనను మాత్రం తీసుకుని బాగా గిలకొట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక మెత్తగా చేసుకున్న చేపల మిశ్రమాన్ని కట్ లెట్లా షేప్ చేసుకుని.. కోడిగుడ్డు మిశ్రమంలో ముంచిన వెంటనే రస్క్ పౌడర్‌లో తడిపి బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు వేయించుకుని టమోటా సాస్‌తో సర్వ్ చేయాలి.