టమోటాలతో బజ్జీ ఎలా చేయాలి?
టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎసిడిటీకి చెక్ పెట్టే టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమోటాలతో మసాలా బజ్జీ ఎలా చేయాలో చూద్దాం..కావలసిన పదార్థాలు...టొమాటోలు - పావు కేజీబంగాళాదుంపలు - పావు కేజీ నూనె - తగినంతఉల్లిపాయలు - 3పచ్చిమిర్చి - 4శనగపిండి - ఒక కప్పుగరంమసాలా - 2 టేబుల్ స్పూన్లుకొత్తిమీర - ఒక కప్పుపెసరపప్పు - 4 టేబుల్ స్పూన్లుతయారీ విధానం : టొమాటోలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి.ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమాటాల్లో కూరాలి. ఈ టమాటాలను జారుగా కలిపి ఉంచిన శనగపిండి మిశ్రమంలో ముంచి వేడైన నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించి తీసివేయాలి. అంతే టమాటా మసాలా బజ్జీ రెడీ.