అసలే వర్షాకాలం.. రాత్రి డిన్నర్‌కు వేడివేడిగా కాసింత వెరైటీ రైస్ ఉంటే బాగుంటుంది కదా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే వెంటనే ... మధుమేహాన్ని, ఒబిసిటీని దూరం చేసే మష్రూమ్స్ అండ్ ఎగ్ కాంబినేషన్‌లో ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి.
ఎలా చేయాలంటే..?
కావలసిన పదార్థాలు :
రైస్ : రెండు కప్పులు
తరిగిన ఉల్లిపాయలు : ఒక కప్పు
టమోటా తరుగు : ఒక కప్పు
కోడిగుడ్లు : రెండు
కొత్తిమీర తరుగు : ఒక కప్పు
కారం : ఒక టీస్పూన్
నిమ్మరసం: ఒక టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్టు : ఒకటిన్నర స్పూన్
మష్రూమ్ ముక్కలు : ఒక కప్పు
ఉప్పు, నూనె : తగినంత
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో నూనెవేసి వేయించాక అందులో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత మష్రూమ్ ముక్కలను కూడా చేర్చుకోవాలి. బాగా వేగాక కారం, జీరా, ధనియా, ఛాట్ మసాలా, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మరో పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
తర్వాత గుడ్డుసొన వేసి పొడిపొడి అయ్యాక ఉడికించిన రైస్‌ను మిక్స్ చేయాలి. చివరగా నిమ్మరసం కలగలుపుకోవాలి. అంతే మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్‌ని హాట్ హాటగా బటర్ చికెన్, కడాయ్ పనీర్ కాంబినేషన్‌లో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.