వర్షా కాలం వచ్చేసింది. నోటికి వేడివేడిగా కరకరలాడుతూ కారంగా టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. పిల్లలు అయితే బాగా మారాం చేస్తుంటారు. అలాంటివారికి చక్కగా కారంబూందీ చేసిపెడితే ఎంచక్కా టిఫిన్ బాక్సులో వేసుకుని కరకర నమిలేస్తారు. ఈ కారంబూందికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.
బియ్యం పిండి ఒక గ్లాసు, నూనె 100 గ్రాములు, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక స్పూన్, చిటికెడు పసుపు, 4 గ్లాసులు శనగపిండి సిద్ధం చేసుకోవాలి.
ఎలా చేయాలి?
శనగపిండి, బియ్యంపిండి జల్లించుకుని ఉప్పు వేసి నీళ్లు పోసి గరిటజారుగా పసుపు వేసి కలుపుకోవాలి. అరగంట నానిన తర్వాత బాణలిలో నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఆ తర్వాత బూందీ గరిట తీసుకుని దానిపై ఈ పిండి నూనెలో పడేవిధంగా వేయాలి. బాణలో బూందీ ఎర్రగా వచ్చేవరకూ వుంచి తీసివేయాలి. అంతే... కరకరలాడే బూంది రెడీ అయిపోయినట్లే. వర్షాకాలంలో పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.