Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒబిసిటీ, టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేసే ఎగ్‌తో బిర్యానీ ఎలా చేయాలి?

Advertiesment
Egg biryani
, సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (18:10 IST)
అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఈవెనింగ్ స్నాక్స్‌లో బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవడం ఉత్తమం తద్వారా శరీరానికి కావలసిన కెలోరీలు అందుతాయి. ఇంకా ఆకలి మితంగా ఉంటుంది. తద్వారా మరింత ఫుడ్ తీసుకునే యోచన రాదు. దీంతో ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. కోడిగుడ్డు ద్వారా ప్రొటీన్లు, ఫ్యాట్స్‌, కార్బొహైడ్రేట్‌లు పుష్కలంగా లభిస్తాయి. రోజుకో కోడిగుడ్డు తింటే టైప్-2 డయాబెటీస్‌ను దూరం చేసుకోవచ్చు. అలాంటి గుడ్డుతో ఆమ్లెట్‌లతో పరిమితం కాకుండా బిరియాని ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
ఉడికించిన కోడిగుడ్లు : ఆరు 
బాస్మతి రైస్ : నాలుగు కప్పులు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు 
దాల్చిన చెక్క, లవంగాలు : అర స్పూన్ 
నూనె, ఉప్పు : సరిపడా 
పచ్చిమిర్చి పేస్ట్ : నాలుగు స్పూన్లు 
పసుపు : అర టీ స్పూన్
కొత్తిమీర : గార్నిష్‌కు సరిపడా
ఉల్లి, టమోటా తరుగు : చెరో అర కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి మంచినీటితో కడిగి పక్కనబెట్టుకోవాలి. తర్వాత స్టౌమీద బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో నీళ్లుపోసి, ఉప్పు కలిపి కడిగిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. బియ్యం కాస్త పలుకుగా ఉన్నప్పుడు కోడిగుడ్లు, జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ. ఈ బిర్యానీని చికెన్ 65, గ్రేవీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

Share this Story:

Follow Webdunia telugu