అందమైన అమ్మాయిలు... అందుకు 627 గంటలు కావాలా...?
తన అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడంలో మహిళలు ముందు వరుసలో ఉంటారన్నది వేరే చెప్పక్కర్లేదు. వారానికి సరాసరిన మహిళ తన అందంపైన 12 గంటల 4 నిమిషాల సమయం వెచ్చిస్తుందట. ఏడాది మొత్తం చూసినప్పుడు ఇది 627 గంటల 28 నిమిషాలని ఓ అధ్యయనంలో తేలింది. వారంలో తను ఏ దుస్త
తన అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడంలో మహిళలు ముందు వరుసలో ఉంటారన్నది వేరే చెప్పక్కర్లేదు. వారానికి సరాసరిన మహిళ తన అందంపైన 12 గంటల 4 నిమిషాల సమయం వెచ్చిస్తుందట. ఏడాది మొత్తం చూసినప్పుడు ఇది 627 గంటల 28 నిమిషాలని ఓ అధ్యయనంలో తేలింది. వారంలో తను ఏ దుస్తులు ధరించాలన్న దానిపై 50 నిమిషాల పాటు తర్జనభర్జన పడుతుందట. వాటిని సెలెక్ట్ చేశాక కూడా అవి తనకు బాగున్నాయో లేదోనని చెక్ చేసుకునేందుకు మరో 30 నిమిషాలు కేటాయిస్తుందట.
మొత్తం 2000 మంది మహిళలపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇంకా టీనేజ్ అమ్మాయిల్లో 10 మందికి తొమ్మిది మంది తమ అందం ఆకర్షణీయంగా చూపే దుస్తుల కోసం ఆరాటపడతారట. మొత్తమ్మీద చూస్తే అందం కోసం మహిళలు వెచ్చించే సమయం సామాన్యమైంది కాదని తేలింది.