Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాగ్రన్స్ రేంజ్ బ్లాంకోని పరిచయం చేసేందుకు చేతులు కలిపిన పాప్ స్టార్ కింగ్, కంటెంట్ క్రియేటర్ రాజ్ షమాని

Advertiesment
Dawn
, సోమవారం, 15 మే 2023 (20:37 IST)
హౌస్ ఆఫ్ ఎక్స్... అందరికి సుపరిచితమైన పేరు. క్రియేటర్‌లకు 7 రోజుల్లో బ్రాండ్‌లను సృష్టిస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది మొదటి టెక్ ప్లాట్‌ఫారమ్ అయిన హౌస్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు వినియోగదారుల కోసం డీ2సీ బ్రాండ్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ భారతీయ పాప్ స్టార్ కింగ్‌తో చేతులు కలిపింది. అందులో భాగంగా మొట్టమొదటి బ్రాండ్ లాంచ్ చేసింది. అదే బ్లాంకో. పాప్ స్టార్ కింగ్ ఆలోచనల్లోంచి పుట్టింది బ్లాంకో. తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న కింగ్... ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి నాంది పలికాడు. బ్లాంకో అనేది పెద్దగా మరియు ధైర్యంగా కలలు కనే వ్యక్తులను శక్తిమంతం చేయడానికి ఉద్దేశించబడింది సువాసన బ్రాండ్.
 
చిన్న వయస్సులోనే సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాడు కింగ్. తు ఆకే దేఖ్లే, మాన్ మేరీ జాన్ వంటి ప్రసిద్ధ పాటలతో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. మన జీవితంలో జరిగే రోజువారీ సంఘటనల ఆధారంగా చేసుకుని పాటలు రూపొందిస్తాడు. ఇదే అతడిని అభిమైనవాడిగా మార్చేసింది. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, మినిమలిస్ట్ ప్యాకేజింగ్‌తో, కింగ్ తన అభిమానుల కోసం ఒక సందేశాన్ని అందించాడు. ఇది మీ జీవితం, ప్రతీ క్షణాన్ని లెక్కపెట్టుకోండి. బ్లాంకో యొక్క వెబ్‌సైట్‌ ను ప్రత్యేకంగా ప్రారంభించడం, బ్లాంకో ధర, నాణ్యత మరియు ఎంపికపై రాజీ పడకుండా నాణ్యమైన వస్త్రధారణ ఉత్పత్తులకు ఉపయోగపడే విధంగా ఈ సువాసన బ్రాండ్ ని రూపొందించాడు.
 
ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఇండియన్ పాప్‌స్టార్ మరియు బ్లాంకో వ్యవస్థాపకుడు కింగ్ మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ... ఫైనల్ గా నా ప్రియమైన స్నేహితుడి రాజ్‌తో మేము కలలుగన్న బ్లాంకోను రియాలిటీగా మార్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇది నాకు ఎంతో భావోద్వేగమైన సమయం. బ్లాంకో నా స్వంత ప్రయాణంలో, నా పర్సనల్ స్పేస్ నుంచి వచ్చింది. జీవితమంతా హడావిడిగా గడిపిన వ్యక్తిగా, నా అభిమానులు తమ స్వీయ-ఆవిష్కరణల ప్రయాణాలను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించగలరని భావిస్తున్నాను. అంతేకాకుండా వారి ధైర్యమైన కలలతో మూస పద్ధతులను బద్దలు కొట్టగలరని నేను కోరుకుంటున్నాను. బ్లాంకో యొక్క పునాది వారి కలలపై నిర్మించబడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ది నెక్స్ట్ బిగ్ థింగ్‌ను విశ్వసించే హౌస్ ఆఫ్ ఎక్స్‌లోని నా భాగస్వాములతో కలిసి, బ్లాంకో మరియు దాని సమర్పణలను ప్రపంచానికి అందించడానికి నేను సంతోషిస్తున్నాను అని అన్నారు ఆయన.
 
పేరులో ఉన్నట్లుగానే... బ్లాంకో అంటే 'బ్లాంక్ అవుట్ ది వరల్డ్'. ఇది సమాజం యొక్క హడావుడి నుంచి బయటకు వచ్చి, వారికి అత్యంత ముఖ్యమైన స్వరాన్ని వినమని ప్రోత్సహిస్తుంది. శాశ్వత ముద్ర మరియు బలమైన ప్రకటనను సృష్టించడం ద్వారా వినియోగదారులకు అందించడానికి కట్టుబడి, ఉత్పత్తులు మరింత వ్యక్తిగతంగా మారడానికి వస్త్రధారణను విప్లవాత్మకంగా మార్చడానికి క్యూరేట్ చేయబడ్డాయి.
 
ఈ సందర్భంగా కంటెంట్ క్రియేటర్ మరియు హౌస్ ఆఫ్ ఎక్స్ వ్యవస్థాపకుడు రాజ్ షమాణి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “కింగ్‌తో మా మొట్టమొదటి బ్రాండ్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అభిమానుల పట్ల అతని నిబద్ధత అద్భుతం. అలాగే క్రియేటర్స్ యొక్క పెద్ద కలలను సాకారం చేయడంలో హౌస్ ఆఫ్ ఎక్స్ అందిస్తున్న సేవలు కూడా అనిర్వచనీయం. క్రియేటర్ నేతృత్వంలోని డీ2సీ బ్రాండ్‌లను ప్రారంభించే టెక్-ప్లాట్‌ఫారమ్‌గా మొదటి-మూవర్ ప్రయోజనాన్ని కలిగి ఉన్నందున, మా ఎండ్-టు-ఎండ్ టూల్స్‌తో బ్లాంకోను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగల సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. ప్రపంచం కోసం జీవితం కంటే పెద్దదాన్ని నిర్మించాలనే తన అభిరుచిని చానలైజ్ చేయడానికి కింగ్ యొక్క ప్రేరణ చాలా శక్తిమంతమైనది. అతని కన్న కలలను వాస్తవ రూపంలో తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము అని అన్నారు.
 
హస్లర్‌లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా వారికి మరింత శక్తినివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది కింగ్స్ బ్లాంకో. కింగ్ నమ్మకాన్ని నిజం చేస్తూ, తాజా ప్రయోగం అతని అభిమానులు పెద్ద కలలను కలిగి ఉండాలనే ప్రేమకు నిజమైన నిదర్శనం. ఇందుకోసం డాన్ మరియు డస్క్ సువాసనల రేంజ్ వరుసగా రూ. 999/- మరియు రూ. 1499గా నిర్ణయించారు. రెండు శ్రేణుల మొదటి లాంచ్ అమ్మకపు ఫ్యాన్ ధరని రూ. 999గా నిర్ణయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేపలతో గారెలు ఎలా చేయాలి..?