యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ యొక్క అధికారిక బ్రాండ్ యూఎస్ పోలో ఆసన్ అలాంటి సంస్థ జైపూర్‌కి చెందిన గౌరవనీయులు శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ (పాచో)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి తమకు చాలా గర్వంగా ఉందని ప్రకటించింది పోలో అసోసియేషన్. ఈ భాగస్వామ్యం ద్వారా U.S. పోలో Assn, గౌరవనీయులు శ్రీ సవాయ్ పద్మనాభ్ సింగ్ సంయుక్తంగా కలిసి సరికొత్త కలెక్షన్‌ను స్పోర్టీ లుక్ కోరుకునే వారికి అందిస్తాయి. జైపూర్ రాజరిక వారసత్వం, స్పోర్ట్స్ ఫ్యాషన్ యొక్క సొగసుని రెంటిని కలిపి అందంగా చేసిన ప్రీమియం క్యాప్సూల్ లైన్ ఈ స్పోర్ట్ ఔట్ ఫిట్.
జైపూర్ యొక్క గొప్ప వారసత్వం, చరిత్ర, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కలెక్షన్‌ను రూపొందించారు. ఈ కలెక్షన్లో జైపూర్ నగరం అనగానే మనకు గుర్తుకు వచ్చే రసత్వం, రాజ కుటుంబం, పోలో సంప్రదాయాలు కన్పిస్తాయి. అంతేకాకుండా జైపూర్ యొక్క ఐకానిక్ పంచరంగ జెండా యొక్క గాంభీర్యం, రాచరిక వారసత్వాన్ని ఇందులో పొందుపరిచారు. వీటితో పాటు జైపూర్ సిటీ ప్యాలెస్ యొక్క అద్భుతమైన నిర్మాణాలను ప్రేరణగా తీసుకుని రూపొందించారు. రాచరిక వారసత్వాన్ని ఇనుమడింప చేసే వారి వార్డ్ రోబ్‌ను వినియోగదారులకు కూడా అందించాలనే కృతనిశ్చయంతో ఈ కలెక్షన్‌ను రూపొందించారు.
"మా సరికొత్త గ్లోబల్ అంబాసిడర్‌గా పాచో... మా స్పోర్ట్స్ ఆధారిత బ్రాండ్‌కు అద్భుతమైన ప్రతినిధి. ఆయన మన దేశంలో అత్యుత్తమ పోలో ప్లేయర్. అన్నింటికి మించి ఆయన గొప్ప సంస్కర్త. ఎప్పటికప్పుడు పరులకు సాయం చేసేందుకు తపన పడేవారు. మరోవైపు ఫ్యాషన్ ఐకాన్‌గా ఒక స్పోర్ట్ ఎక్కడ ఫ్యాషనబుల్‌గా ఉంటుందో అక్కడ కచ్చితంగా అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది అని అన్నారు U.S. పోలో అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ శ్రీ జే.మైఖేల్ ప్రిన్స్. ఆయన మాట్లాడుతూ... ఈ సరికొత్త కలెక్షన్ U.S. పోలో అసోసియేషన్‌కు సంయుక్తంగా రూపొందుతుంది. గ్లోబల్ బ్రాండ్ యొక్క గొప్పదనం, హ్యాండ్ క్రాఫ్ట్, చారిత్రాత్మక ప్రభావం, శాశ్వతమైన శైలి కోసం ఇది భారతదేశ మార్కెట్‌తో విజయవంతమవుతుందని మేము అంచనా వేస్తున్నాము అని అన్నారు ఆయన.
ఆటమ్-వింటర్ 2024 సీజన్‌లో ప్రారంభమయ్యే ఈ సరికొత్త క్యాప్సూల్ కలెక్షన్.. రిచ్ ఫ్యాబ్రిక్స్, అత్యంత క్లిష్టమైన జర్దోసీ క్రెస్ట్ డిటైలింగ్, యు.ఎస్. పోలో యొక్క అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. అన్నింటికి మించి శక్తివంతమైన జైపూర్ నగరం యొక్క చారిత్రక వారసత్వాన్ని కూడా ఈ కలెక్షన్లో పొందుపరిచారు. మరోవైపు గౌరవనీయులు సవాయి పద్మనాభ్ సింగ్ వ్యక్తిగత శైలి, ఆలోచనాత్మకంగా ఎంచుకున్న రంగుల నుండి విలాసవంతమైన అల్లికల వరకు ప్రతి అంశంలోనూ ప్రకాశిస్తుంది. ప్రతి భాగాన్ని జైపూర్ వారసత్వం, సమకాలీన గాంభీర్యం యొక్క ప్రత్యేక సమ్మేళనంతో నింపుతుంది.
“U S పోలో అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా పోలో యొక్క అతిపెద్ద ప్రమోటర్‌గా ఉంది. ఈ బ్రాండ్ అసోసియేషన్‌తో నేను భారతదేశంలో పోలో కథను తెరపైకి తీసుకురావాలని ఆశిస్తున్నాను. కలెక్షన్, ప్రమోషన్ రెండూ నా వ్యక్తిగత శైలిని ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా రాజస్థాన్‌లోని స్వదేశీ మార్వాడీ గుర్రంతో సహా పోలో, గుర్రాల పట్ల నాకున్న అభిరుచిని కూడా ప్రతిబింబిస్తాయి. అందరం కలిసి ఈ క్రీడను కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం అని అన్నారు శ్రీ సవాయ్ పద్మనాభ్ సింగ్.
సందర్భంగా USPA (అరవింద్ బ్రాండ్స్ లిమిటెడ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమితాబ్ సూరి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... గౌరవనీయులు సవాయి పద్మనాభ్ సింగ్ గారితో భారతదేశంలో ఈ భాగస్వామ్యం U.S. పోలో Assn కోసం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. జైపూర్ రాచరిక వారసత్వాన్ని మా బ్రాండ్ యొక్క సిగ్నేచర్ స్పోర్ట్-ప్రేరేపిత ఫ్యాషన్‌తో మిళితం చేయడం ద్వారా, మేము గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఆధునిక అధునాతనత రెండింటినీ ప్రతిబింబించే సేకరణను సృష్టించాము. పోలో గేమ్‌ను అర్థం చేసుకుంటూ చేసుకుంటూ జైపూర్ చరిత్ర యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పే ఏకైక అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తున్నాము” అని అన్నారు ఆయన.