Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

GenZ fashion-tech brand NEWME

ఐవీఆర్

, గురువారం, 30 మే 2024 (16:42 IST)
జెన్ జెడ్ మహిళల కోసం భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్-టెక్ బ్రాండ్‌లలో ఒకటైన న్యూమీ, భారతదేశంలో తమ అతిపెద్ద రిటైల్ స్టోర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో వున్న శరత్ సిటీ మాల్‌లో ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది. శరత్ సిటీ మాల్‌ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఈ స్టోర్,  దేశంలో న్యూమీ యొక్క ఐదవ రిటైల్ స్టోర్ కాగా నవాబుల నగరంలో మొదటిది. ఈ స్టోర్ 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, ఇది గర్ల్ డోమ్ యొక్క ఆకర్షణీయమైన నేపథ్యం చుట్టూ రూపొందించబడింది, ఇది బ్రాండ్ యొక్క యువ, డైనమిక్ వినియోగదారుల నడుమ ప్రతిధ్వనించే శక్తివంతమైన, వినూత్నమైన ఇంటీరియర్‌లను కలిగి ఉంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవం లో భాగంగా, జూన్ 2 ఆదివారంతో ముగిసే మొదటి మూడు రోజుల పాటు న్యూమీ తన వినియోగదారులందరికీ ప్రత్యేకమైన 25% తగ్గింపును అందిస్తోంది. 
 
భారతదేశం అంతటా 500 మిలియన్లకు పైగా జెన్ జెడ్  కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారతదేశంలోని ఫ్యాషన్-టెక్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి న్యూమీ సిద్ధంగా ఉంది. ఈ తరం ఆకాంక్షలు, విలువలను ప్రతిబింబించే రిటైల్ స్టోర్‌లతో ఈ బ్రాండ్ భారతదేశంలో జెన్ జెడ్  ప్రభావవంతమైన వాయిస్‌గా మారింది. ఈ దుకాణాలు షాపింగ్ గమ్యస్థానాలుగా మాత్రమే కాకుండా ఫ్యాషన్ స్వీయ-వ్యక్తీకరణకు మాధ్యమంగా మారే అనుభవపూర్వక ప్రదేశాలుగా రూపొందించబడ్డాయి. సెల్ఫీ-ప్రేమికులకు అనుకూలంగా ట్రయల్ రూమ్‌లు, సృజనాత్మక నేపథ్యాలతో తీర్చిదిద్దబడిన ఇంటీరియర్‌లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయదగినవి. 
 
స్టోర్ ప్రారంభోత్సవంలో, న్యూమీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ జసోరియా మాట్లాడుతూ, “హైదరాబాద్ ఎల్లప్పుడూ దాని ఉత్సాహపూరితమైన  సంస్కృతి మరియు శక్తివంతమైన వినియోగదారుల జనాభాతో మా హృదయాలకు దగ్గరగా ఉంటుంది. మా ఆన్‌లైన్ షాపర్‌లలో అధిక శాతం ఈ నగరం నుండి ఆర్డర్ చేయడం మేము చూస్తున్నాము. వారి అవసరాలను  తీర్చడానికి మేము భారతదేశంలోనే మా అతిపెద్ద రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్ నడిబొడ్డున ప్రారంభించాము. అద్భుతంగా రూపొందించిన మా స్టోర్ చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాకు మద్దతునిచ్చిన మా కస్టమర్‌లు తమ వ్యక్తిత్వాలను, న్యూమీ బ్రాండ్‌ను నిజంగా ప్రతిబింబించే మా విస్తృతమైన కలెక్షన్‌ను భౌతికంగా ఆస్వాదించగలరని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు. 
 
ఆయనే మాట్లాడుతూ "మా ఓమ్నీ ఛానెల్ కార్యకలాపాలను బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా, రాబోయే 12-15 నెలల్లో, మేము ఇండోర్, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్ కోల్‌కతా, గౌహతి, భారతదేశంలోని ఇతర టైర్ 1, 2 నగరాలకు విస్తరించాలని ప్రణాళిక చేస్తున్నాము. రాబోయే సంవత్సరాల్లో, మేము జెన్ జెడ్ కోసం భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్-టెక్ బ్రాండ్‌గా అవతరించాలని, మా ఉత్పత్తి ఆఫర్‌లను పెంచాలని కోరుకుంటున్నాము, ఇది భారతీయ మార్కెట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మా ముద్రను కూడా సృష్టిస్తుంది” అని అన్నారు. న్యూమీ ఇటీవల దాని స్టైలిష్ కలెక్షన్ ను  జెన్ జెడ్  వీక్షకుల నడుమ ప్రసిద్ధి చెందిన ఎం టివి  స్ప్లిట్స్‌విల్లాలో ప్రదర్శించినప్పుడు గణనీయమైన దృశ్యమానతను పొందింది. 
 
హైదరాబాద్‌తో పాటు, న్యూమీ ఇటీవల బెంగుళూరు, ముంబై, చండీగఢ్‌లలో స్టోర్‌లను ప్రారంభించింది, ప్రతి ఒక్కటి జెన్ జెడ్ యొక్క షాపింగ్ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ దుకాణాలు రిటైల్ స్పేస్‌లకు మించి, సృజనాత్మక మరియు 'ఇన్‌స్టాగ్రామబుల్' వాతావరణాలను అందిస్తాయి. గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్‌ల నుండి ప్రేరణ పొందిన న్యూమీ యొక్క ప్రత్యేకమైన డిజైన్‌లు బ్రాండ్ యొక్క రిటైల్ స్టోర్‌లు, యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ తాజా మరియు ట్రెండింగ్ స్టైల్స్ ఎల్లప్పుడూ న్యూమీ కస్టమర్‌లను ముందుగా చేరుకుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?