Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ స్టార్ దీపిక పదుకోన్ తన 82°E క్లియర్ సన్‌స్కీన్ జెల్: లికోరైస్ బీమ్‌ను విడుదల చేశారు

Deepika
, గురువారం, 15 జూన్ 2023 (15:37 IST)
బాలీవుడ్ స్టార్, గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపిక పదుకోన్ మోడ్రన్ సెల్ఫ్ కేర్ బ్రాండ్ 82°E ద్వారా చర్మ సంరక్షణకు ఎంతో ఉపకరించే లికోరైజ్ బీమ్ ఎస్‌పిఎఫ్ 40 పీఏ+++ సన్ స్క్రీన్ జెల్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సన్ స్క్రీన్ జెల్‌లో చర్మానికి రక్షణను అదించే సెరామైడ్స్ కలిగిన లికోరైజ్ ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ఈ లికోరైజ్ బీమ్ ఎస్‌పిఎఫ్ 40 పీఏ+++ సన్ స్క్రీన్ జెల్ యూవీఏ, యూవీబీ అంటే అతినీల లోహిత కిరణాల నుంచి చర్మం పాడుకాకుండా కాపాడుతుంది. లైకోరైస్ బీమ్ ప్రత్యేకమైన జెల్ ఫార్ములా చర్మంలోకి సులువుగా ఇంకిపోతుంది. అలాగే, ఎటువంటి జిడ్డు లేకుండా చూస్తుంది.
 
‘ఈ 82°Eతో అవసరం ఉన్నా లేకపోయినా అన్నింటికి కలిపి, ఒకే పరిమాణానికి సరిపోయే విధంగా ఇంతకుముందు సన్ స్క్రీన్ జెల్‌లు తయారు అయ్యేవని గుర్తించాము. అందుకే మేము లైకోరైస్ బీమ్‌ను పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జిడ్డుగా మారిన చర్మానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ జెల్‌ను సన్‌స్క్రీన్‌ల ప్యాలెట్‌కు జోడించడం ఆనందంగా ఉంది. చర్మ సమస్యలు తీర్చే విధంగా వైద్యపరంగా రుజువైనటువంటి ఫార్ములాతో తయారైన సన్‌స్క్రీన్‌లను అందించడం మాకు గర్వకారణంగా ఉంది’ అని 82°E చీఫ్ మార్కెటింగ్ అధికారి కీర్తన రామకృష్ణన్ హర్షాన్ని వ్యక్తం చేశారు.
 
ఈ సరికొత్త సన్‌స్క్రీన్ లైకోరైస్ బీమ్ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా కనిపించేలా చేస్తుందని వైద్యపరంగా నిరూపించబడింది. అలాగే, 82°E స్క్రిన్ కేర్ అధిక-నాణ్యత, అధిక-పనితీరు కలిగిన ఉత్పత్తులను రూపొందించేందుకు శక్తివంతమైన శాస్త్రీయ సమ్మేళనాలతో కూడిన పదార్థాలను మిళితం చేస్తుంది. లైకోరైస్ బీమ్ లైకోరైస్ మరియు సిరామైడ్‌ల శక్తివంతమైన కలయికతో సమృద్ధిగా ఉంటుంది. ‘‘లైకోరైస్ బీమ్‌తో మేము సన్ స్క్రీన్ జెల్ మాత్రమే కాకుండా చర్మానికి పోషణ మరియు కాంతిని అందించే సన్‌స్క్రీన్‌ను రూపొందించాలనుకుంటున్నాము’’ అని 82°E రీసెర్చ్ అండ్ హెడ్ అంజలి ఘోలప్ పేర్కొన్నారు. లైకోరైస్ బీమ్‌ను తీవ్ర పరిశోధ మరియు అభివృద్ధి అనంతరం తయారు చేశాము. ఈ వినూత్నమైన, జిడ్డు లేని జెల్‌ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీతో పొరబాటున కూడా తినకూడని 7 ఆహారాలు, ఏంటవి?