రామమందిర నిర్మాణం : ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (11:42 IST)
2014
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రామమందిరాన్ని రాజ్యాంగానికి లోబడి నిర్మిస్తామని కమలనాథులు ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మేనిఫెస్టోలో కమలనాథులు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి రామమందిరాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే, దళితులు, మైనార్టీలు, ఇతరవర్గాల అభివృద్ధిని కూడా ఇందులో పొందుపర్చారు. ఈ మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, అద్వానీలు సంయుక్తంగా సోమవారం విడుదల చేశారు. ఒక దేశం.. మహోన్నత భారత్ బీజేపీ ఉద్దేశ్యమన్నారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని 17 మంది సభ్యుల కమిటీ దీన్ని తయారు చేసినట్టు చెప్పారు. ప్రణాళిక రూపకల్పణకు లక్ష సూచనలు అందాయని జోషీ చెప్పారు. రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తల నుండి సూచనలు అందినట్లు చెప్పారు.