Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ వీడియోలు చూపిస్తూ ఏకుతున్న కాంగ్రెస్... యాంకర్ తో డిగ్గీ 'రాజా' అబ్బొబ్బో...

మోడీ వీడియోలు చూపిస్తూ ఏకుతున్న కాంగ్రెస్... యాంకర్ తో డిగ్గీ 'రాజా' అబ్బొబ్బో...
, బుధవారం, 30 ఏప్రియల్ 2014 (19:29 IST)
FILE
ఎన్నికలు 2014 జరుగుతున్నాయి. ఐతే రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కాబోలు. కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగా నరేంద్ర మోడీకి సంబంధించిన అవినీతి అంటూ గత నెల రోజుల నుంచి ఆయన వల్ల లబ్ది పొందారంటూ కొంతమంది పేర్లను బయటపెడుతూ ఉతికి ఆరేస్తోంది.

మోడీ నిజమైన ప్రోబిజినెస్‌మేన్ లేదంటే కేవలం ప్రొ-అదానీనా...?
ఇలా టైటిలుతో ఒక వీడియోను అప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా తెలిపింది. నరేంద్ర మోడీ నిబంధనలకు పాతరేసి అదానికి 15,946.32 ఎకరాలను ఒక చదరపు మీటరను కేవలం రూ.1 నుంచి 32 మధ్య కట్టబెట్టారు. టీసీఎస్,మారుతి, టాటా మోటర్స్, ఫోర్డ్ ఇండియా వంటివారికి ఇచ్చిన విలువతో పోల్చి చూసినప్పుడు ఇది 670 నుంచి 6000 రెట్లు తేడా ఉంది.

వారికి అంతటి ధరకు కట్టబెట్టిన మోడీ, అదానికి మాత్రం కారుచౌకకు భూములు ధారాదత్తం చేశారు. మోడీ చూపిన అవ్యాజమైన ప్రేమకు అదాని ఆస్తులు 2002లో 765 మిలియన్ డాలర్లు ఉండగా ఇప్పుడు ఎకాఎకిన 2013 నాటికి 8.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మోడీ అదానికి భూములు కట్టబెట్టిన వైనాన్ని ఏమని పిలువాలి...?

మధ్యప్రదేశ్ భాజపా ముఖ్యమంత్రి ఫోటోషాప్ ప్రచారం
అధికారమిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్గధామం చేస్తానన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు నీటిమీద రాతల్లా ఉన్నాయి. స్వర్గధామం సంగతి ఏమోగానీ కనీసం సామాన్యప్రజలకు కూడు, గుడ్డ, నీటిని కూడా అందజేయలేకపోతోంది.

ఐతే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లే కోల్‌కతా-ఢిల్లీ జాతీయ రహదారికి ఇరువైపులా మధ్యప్రదేశ్ తెగ అభివృద్ధి చెందిందంటూ ఫోటోషాపులను తలపించే హోర్డింగులతో హోరెత్తిస్తున్నారు. కానీ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధం. అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

డిగ్గీ రాజా రాసలీలలు.... కాంగ్రెస్ ఏం చెపుతుంది...?
webdunia
FILE

వరుస వీడియోలు, కథనాలతో ఉతికి ఆరేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఐతే తాజాగా దిగ్విజయ్ సింగ్, యాంకర్ అమృత రాయ్ మధ్య వెలుగు చూసిన అక్రమ సంబంధం వ్యవహారం ఆ పార్టీ పరువును అప్రతిష్ట పాలుచేసినట్లే అనుకోవాలి. దాదాపు కూతురు వయసున్న అమ్మాయితో దిగ్విజయ్ ప్రేమాయణం అంటూ లీకులు బయటకు రావడంతో భాజపా మంచి అస్త్రం దొరికింది. అసలే సీమాంధ్రలో కూనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయం లీలలు కొంపముంచేట్లే ఉన్నాయి. చూడాలి ఓటర్లు ఏం చేస్తారో....?

Share this Story:

Follow Webdunia telugu