Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ : "ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్"

బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ :
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (12:51 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సోమవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో రామమందిర నిర్మాణం, దేశ ఆర్థికాభివృద్ధి, దళితులు, మైనార్టీ వర్గాల ప్రజల అభివృద్ధి, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం తదితర అంశాలను పొందుపరిచారు. ఈ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని 17 మంది సభ్యులు కలిగిన కమిటీ తయారు చేసింది. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు.

* ఎన్నికల్లో బీజేపీ నినాదాలు: 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్', 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'.
* అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దపీట.
* అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక.
* వ్యవస్థలో మార్పులు, పాలనలో పారదర్శకత.
* మరిన్ని ఎన్నికల సంస్కరణలను తీసుకువస్తాం.
* చట్ట పరిధిలో రామాలయ పునర్నిర్మాణం.
* మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం.

* ఈ గవర్నెన్స్ కు పెద్దపీట.
* బ్రాండ్ ఇండియాను నిర్మిస్తాం.
* ఉపాధి కల్పనకు ప్రాధాన్యత.
* దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.
* మల్టీ బ్రాండ్ రీటెయిల్ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అనుమతించం.
* వెనుకబడ్డ రాష్ట్రాలను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేస్తాం.
* సరళతరమైన పన్నుల విధానాన్ని తీసుకొస్తాం.
* వ్యవసాయ భూములకు సాగునీటి కల్పన, ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీరు.
* గ్రామీణ ప్రాంతాలకు వైఫై (ఇంటర్నెట్) సదుపాయం.
* పోలీసు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాం.
* తీవ్రవాద నిరోధానికి ప్రత్యేక యంత్రాంగం.

* దేశవ్యాప్తంగా గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు.
* ప్రజారోగ్యం కోసం కొత్త పాలసీ. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి.
* టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 50 టూరిస్ట్ సర్య్కూట్స్ ఏర్పాటు.
* అన్ని వర్గాలకు సమానంగా ముస్లింలకు అవకాశాలు. మదర్సాల అభివృద్ధికి కొత్త పథకం.
* పీవోకేలో ఉన్న శరణార్థుల డిమాండ్లను అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తాం.
* పారిశుద్ధ్య కార్మిక (స్కావెంజర్స్) వ్యవస్థ పూర్తిగా నిర్మూలం.
* వికలాంగుల సంరక్షణకు ప్రత్యేక పథకాలు.
* విదేశాల్లోని నల్లధనం వెనక్కి రప్పించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
* హిమాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధి.
* సామానత్వాన్ని సాధించేందుకు ఉమ్మడి పౌర స్మృతి.
* దేశ అభివృద్ధి కోసం నూతన వైజ్ఞానిక ఆవిష్కరణ.

Share this Story:

Follow Webdunia telugu