Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరబోను : రాజ్‌నాథ్ సింగ్

Advertiesment
నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరబోను : రాజ్‌నాథ్ సింగ్
, శనివారం, 3 మే 2014 (12:36 IST)
File
FILE
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే.. ఆ ప్రభుత్వంలో తాను భాగంపంచుకోబోనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే అందులో తాను భాగస్వామిని కానన్నారు. పార్టీ అధినేతగా నా బాధ్యతలు నాకున్నాయి. అధ్యక్షుడిగా ఉండని సమయంలో ప్రభుత్వంలో ఉన్నా. నా సహచరులు సమర్థులైన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రభుత్వంలో అవకాశం రావాలి' అని చెప్పారు.

ప్రధాని కావడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బీజేపీలో మోడీకే అధికారం ఉందని స్పష్టం చేశారు. మోడీ తప్పకుండా భారతదేశ ప్రధాని అవుతారన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం కావడం ఖాయమని రాజ్‌నాథ్ జోస్యం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu