Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

దేశవ్యాప్తంగా 121 సీట్లలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్!

Advertiesment
ఓటింగ్
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:20 IST)
File
FILE
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర నుంచి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే షోలాపూర్‌లో ఓటేయగా, బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియసూలే ఓటు వేశారు. కర్ణాటకలోని షిమోగాలో బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఓటేశారు.

ఈ ప్రక్రియలో భాగంగా గురువారం 12 రాష్ట్రాల్లోని 121 లోక్ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటకలో 28, రాజస్థాన్‌లో 20, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 11, ఒడిశాలో 11, మధ్యప్రదేశ్‌లో 10, బీహార్‌లో 7, జార్ఖండ్‌లో 6, పశ్చిమ బెంగాల్‌లో 4, చత్తీస్‌గఢ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో 1, మణిపూర్‌లో ఒకటి చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో మొత్తం దాదాపు 16.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 121 స్థానాలకు, 1769 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీటితో పాటు.. ఒడిషా అసెంబ్లీలోని 77 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లూ చేసింది.

ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఒడిషా, జార్ఖండ్ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu