Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్‌లో ఓటేసిన సోనియా

ఢిల్లీ నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్‌లో ఓటేసిన సోనియా
, గురువారం, 10 ఏప్రియల్ 2014 (12:30 IST)
File
FILE
లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో సోనియా ఓటు వేశారు. సోనియాతో పాటు ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, న్యూఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీలు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఔరంగజేబ్ లేన్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తిలక్ నగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరితో పాటు ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఓటు వేశారు. ఇకపోతే.. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ బీహార్‌లోని ససారామ్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా... ఆమె తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తాను పోటీ చేస్తున్న నాగ్‌పూర్‌లో ఓటేశారు.

రక్షణ మంత్రి ఆంటోనీ తిరువనంతపురంలో, మరో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఢిల్లీలో, కాంగ్రెస్ నేత కేవీ థామస్ కేరళలోని కోచిలో, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది కొట్టాయంలో, కేంద్ర సహాయ మంత్రి శశిథరూర్ తిరువనంతపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu