Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేజ్రీవాల్‌ చెంప చెళ్లుమనిపించిన ఢిల్లీ ఆటో డ్రైవర్!

కేజ్రీవాల్‌ చెంప చెళ్లుమనిపించిన ఢిల్లీ ఆటో డ్రైవర్!
, మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (14:40 IST)
File
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైన మరోసారి దాడి జరిగింది. ఈసారి కేజ్రీవాల్‌పైన ఓ ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. న్యూఢిల్లీలోని సుల్తాన్ పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌పైన ఈ డ్రైవర్ దాడికి తెగబడ్డాడు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేజ్రీవాల్ రోడ్డు షో నిర్వహించారు. కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లా తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఉన్నట్టుండి కేజ్రీవాల్ వాహనంపైపు దూసుకొచ్చి చెంప చెళ్లుమనిపించారు. దీంతో అవాక్కైన ఆప్ నేతలు... ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

కాగా, కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు అతనికి భద్రతను ఇస్తున్నారు. కేజ్రీవాల్ నిత్యం భద్రతాధికారుల సూచనలను పట్టించుకోవడం లేదట. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్డుషో సందర్భంగా కేజ్రీవాల్ పైన ఓ వ్యక్తి పిడిగుద్దు కురిపించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu