Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కడికంటే అక్కడకొస్తా, మీ ఇష్టమున్నట్లు కొట్టండి: కేజ్రీ

ఎక్కడికంటే అక్కడకొస్తా, మీ ఇష్టమున్నట్లు కొట్టండి: కేజ్రీ
, మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (17:04 IST)
File
FILE
ఇటీవలి కాలంలో తన పైన వరుసగా జరుగుతున్న దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తనదైనశైలిలో స్పందించారు. తాను ఎక్కడకు రమ్మంటే అక్కడకు.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని, మీ ఇష్టం వచ్చినట్లు కొట్టుకోండని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

తనపై జరుగుతున్న దాడి వెనుక రాజకీయ కుట్ర దాగివుందన్నారు. ముఖ్యంగా.. వరుస దాడుల వెనుక బీజేపీ హస్తముందనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన లక్ష్యం సమస్య పరిష్కారం కావడమే అన్నారు. సమస్య పరిష్కారం అయితే తాను సంతోషిస్తానని చెప్పారు.

ఇదిలావుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైన మరోసారి దాడి జరిగింది. ఈసారి కేజ్రీవాల్‌పైన ఓ ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. న్యూఢిల్లీలోని సుల్తాన్ పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌పైన ఈ డ్రైవర్ దాడికి తెగబడ్డాడు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేజ్రీవాల్ రోడ్డు షో నిర్వహించారు. కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లా తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఉన్నట్టుండి కేజ్రీవాల్ వాహనంపైపు దూసుకొచ్చి చెంప చెళ్లుమనిపించారు. దీంతో అవాక్కైన ఆప్ నేతలు... ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

కాగా, కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు అతనికి భద్రతను ఇస్తున్నారు. కేజ్రీవాల్ నిత్యం భద్రతాధికారుల సూచనలను పట్టించుకోవడం లేదట. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్డుషో సందర్భంగా కేజ్రీవాల్ పైన ఓ వ్యక్తి పిడిగుద్దు కురిపించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu