Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకే ఇందిరాగాంధీ, రాజీవ్ ఖతమయ్యారు... అజంఖాన్

Advertiesment
అజంఖాన్
, శనివారం, 12 ఏప్రియల్ 2014 (14:04 IST)
FILE
ఎన్నికలు 2014 నేపధ్యంలో నాయకులు తమతమ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చింది వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అయితే కుర్రాళ్లు రేప్ చేస్తుంటారనీ, అలాగని వారిని ఉరి తీస్తే ఎలా అంటూ ప్రశ్నించి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు.

ఇపుడు తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ వంతు వచ్చింది. అప్పట్లో జయప్రదపై విమర్శనాస్త్రాలు సంధించే అజం తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై బాణాలు వదిలాడు.

రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు గేట్లు తెరవాలని ఆదేశించినందుకు, అతని సోదరుడు సంజయ్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించినందుకు, ఇందిరా గాంధీ స్వర్ణదేవాలయానికి బుల్డోజర్లను పంపినందుకు ఖతమయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లలా చేసినందుకే అల్లా అలా వారిని శిక్షించారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu