రాహుల్ కారు డ్రైవింగ్ : సోనియా నామినేషన్ దాఖలు!
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (15:37 IST)
తన తనయుడు రాహుల్ గాంధీ కారు డ్రైవింగ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం రాయ్‌బరేలిలో ఎన్నికల నామినేషన్‌ను దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు పురసత్ గంజ్ విమానాశ్రయంలో సోనియాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాహుల్ స్వయంగా కారు నడపగా సోనియా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా సోనియా మీడియాతో మాట్లాడుతూ... ప్రేమాభిమానాలతో తాను రాయ్ బరేలిని దత్తత తీసుకున్నానని... దీనికి ప్రతిఫలంగా అక్కడి ప్రజలు మరోసారి తనకు ఘనవిజయాన్ని అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన ఆమె... 2004 ఎన్నికల్లో అమేథి నుంచి రాయ్ బరేలికి మారారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు.