Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ గాలీ లేదు.. గీలీ లేదు : గట్టిగా చెప్పిన ప్రియాంక

Advertiesment
మోడీ గాలీ లేదు.. గీలీ లేదు : గట్టిగా చెప్పిన ప్రియాంక
, గురువారం, 10 ఏప్రియల్ 2014 (15:51 IST)
File
FILE
దేశంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలి ఏమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ అన్నారు. భర్త రాబర్ట్ వద్రాతో పాటు ప్రియాంకా గాంధీ గురువారంనాడు లోకసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోధుమ రంగు కుర్తా, తెల్ల షాల్వార్ ధరించి అతి సాధారణరీతిలో వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను కేవలం అమ్మ సోనియా పోటీ చేసే రాయబరేలి, సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథీలలో మాత్రమే ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. ఇది మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

గురువారం ఢిల్లీలో తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన తల్లి సోనియా గాంధీ, తమ్ముడు రాహుల్ గాంధీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు. ఇతర నాయకుల తరపున ప్రచారం చేసేందుకు అమ్మ, తమ్ముడు ఉన్నారని ఆమె చెప్పారు.

ప్రియాంక తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ అభ్యర్థులకు తీవ్ర నిరాశకు గురిచేసినట్టే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఛరిష్మా పెద్దగా పనిచేయని నేపథ్యంలో ప్రియాంకా గాంధీతో ప్రచారం చేయించుకుని లబ్ది పొందొచ్చని ప్రణాళికలు రచించిన ఆ పార్టీ సీనియర్ నేతలకు... ప్రియాంకా గాంధీ సుతిమెత్తగా తాను ప్రచారం చేయనని చెప్పేశారు.

Share this Story:

Follow Webdunia telugu