Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టోంక్ సవాయ్ మాదోపూర్‌‌లో మొహ్మద్ అజారుద్దీన్ పోటీ!

Advertiesment
టోంక్ సవాయ్ మాదోపూర్‌‌లో మొహ్మద్ అజారుద్దీన్ పోటీ!
, బుధవారం, 19 మార్చి 2014 (13:07 IST)
File
FILE
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ సవాయ్ మాదోపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి మాజీ క్రికెటర్ మొహ్మద్ అజారుద్దీన్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం రాత్రి 58 పేర్లతో విడుదల చేసిన మూడో జాబితాలో పేర్కొంది. ఈయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.

అలాగే, కేంద్ర మంత్రి కపిల్ సిబల్‌ను ఆయన పాత నియోజకవర్గమైన చాందినీ చౌక్ నుంచి పోటీకి దించనుంది. అజీత్ జోగీ చత్తీస్‌గడ్‌లోని మహాసముంద్ నుండి పోటీ చేస్తారు. కపిల్ సిబల్‌కు చాందినీ చౌక్, జయప్రకాశ్ అగర్‌వాల్‌కు పశ్చిమ తూర్పు ఢిల్లీ, సందీప్ దీక్షిత్‌కు ఉత్తర ఢిల్లీ, అజయ్ మాకెన్‌కు న్యూఢిల్లీ, కృష్ణ తీర్థ్‌థ్‌కు ఉత్తర పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గాలను కేటాయించారు.

కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా ఒడిశాలోని బాలాసోర్, క్రికెటర్ అజరుద్దీన్ రాజస్తాన్‌లోని టోంక్ , సచిన్ పైలట్ అజ్మీర్, జ్యోతి మిర్దా నాగోర్, చంద్రేశ్ కుమారి జోద్‌పూర్ నుండి లోకసభకు పోటీ చేస్తారు. మూడో జాబితాలో కూడా ఏపీ నుంచి ఒక్కరి పేరు కూడా చోటు చేసుకోలేదు.

Share this Story:

Follow Webdunia telugu