హెలికాప్టర్లో విజయశాంతితో పొన్నాల... పైలట్‌తో లడాయి...
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (21:56 IST)
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్జెంటుకు వెళ్లేందుకు విజయశాంతి, ఆయన కలిసి వెళ్లేందుకు హెలికాఫ్టర్ ఎక్కారు. కానీ హెలికాప్టర్ పైలట్ మాత్రం నేను తీసుకెళ్లనంటూ మొరాయించాడు. విషయం ఏంటయా అంటే, ఎన్నికల ప్రచారంలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా మడికొండకు వెళ్లాలని పైలట్ ను అడిగారు. అయితే అక్కడకు తీసుకెళ్లేందుకు తనకు ముందస్తు అనుమతి లేదంటూ అతడు తల పంకించాడు.అంతే పొన్నాలకు కోపం వచ్చింది. పైగా ప్రక్కనే నాయకురాలు, రాములమ్మ విజయశాంతి కూడా ఉన్నారాయె. ఎంతో అడిగి చూసినా హెలికాప్టర్ పైలెట్ మాత్రం ససేమిరా అని మొండికేశాడు. దాంతో కోపం వచ్చిన పొన్నాల హెలికాప్టర్ నుంచి దిగి విసవిసమంటూ వచ్చి కారెక్కి మడికొండకు తుర్రుమన్నారు. అదీ సంగతి.