సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మిస్తా... పవన్ మంచి వ్యక్తి... బాబు
, శుక్రవారం, 16 మే 2014 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటివరకూ ప్రకటించిన స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 88 స్థానాలను దాటి మరో 20 స్థానాల్లో దూసుకు వెళుతోంది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మించాల్సి ఉందని బాబు చెప్పుకొచ్చారు. అలాగే సీమాంధ్ర ప్రయోజనాల కోసం భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఏదేదో మాట్లాడారనీ, కానీ తాను నమ్మిన ప్రకారం కేంద్రంలో ఎన్డీఎ వచ్చిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుని రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ... పవన్ చాలా మంచి వ్యక్తి అనీ, నిస్వార్థంగా తెదేపా గెలుపు కోసం తనవంతు సహాయం అందించారని కొనియాడారు.