Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారణాసిలో నరేంద్ర మోడీపై కేజ్రీవాల్ పోటీ... 2014లో నాదే విజయం..

Advertiesment
అరవింద్ కేజ్రీవాల్
, బుధవారం, 26 మార్చి 2014 (11:19 IST)
FILE
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం నుంచి తాను మోడీపై పోటీ చేస్తానంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

అంతేకాదు... వారణాసిలో గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి మోడీపై గెలుపు తనదే కావాలని ప్రార్థించారు. ఐతే మోడీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ రంగంలోకి దిగడంతో మంగళవారంనాడు వారణాసిలో ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు.

ఐతే తాను వచ్చే వచ్చే 2014 ఎన్నికల్లో వారణాసిలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడిపై పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టీకరించారు. మోడిని ఓడించేందుకు తనకు మద్దతు ఇవ్వాలని వారణాసి ప్రజలకు చెపుతూ ఆయన పర్యటించారు. 2014 ఎన్నికల్లో మోడిపై నాదే విజయం అంటూ ఆయన ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu