Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్ సభకు పోటీ చేయాలని ఉంది... 'లెజెండ్' బాలయ్య 2014 ఎన్నికలపై...

Advertiesment
బాలకృష్ణ
, మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (16:18 IST)
WD
విశాఖపట్నం జిల్లా పరిధిలో లెజెండ్ విజయోత్సవ యాత్రలో పాల్గొంటున్న టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తనయుడు, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ వచ్చే 2014 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేస్తానని సూచనప్రాయంగా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే విడుదలయిన 'లెజెండ్' చిత్రం విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని సినీ యూనిట్ సింహాచలంలోని అప్పన్న ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఐతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాక 2014 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇస్తానని లెజెండ్ బాలయ్య చెప్పుకొచ్చారు. ఇంకా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నందమూరి తారక రామారావుగారి ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందన్నారు.

అయితే, పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ... సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu