Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్ సత్తా జెపి స్వార్థపరుడా...? తన గెలుపు కోసమే అలా చేశారా...?

లోక్ సత్తా జెపి స్వార్థపరుడా...? తన గెలుపు కోసమే అలా చేశారా...?
, శుక్రవారం, 9 మే 2014 (13:55 IST)
WD
2014 ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం నేరుగా లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా స్వార్థపరుడుగా మారిపోయారంటూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారు... ఎందుకిలా చర్చ జరుగుతోంది అని చూస్తే... అసలు లోక్ సత్తా అంటేనే మంచి ఆశయాలు, సిద్ధాంతాలతో ఏర్పాటు చేసిన పార్టీ అని రాష్ట్ర ప్రజల్లో ఉన్నది.

అలాంటి పార్టీని ఇన్నాళ్లు ఎంతగానో అదే గుర్తింపుతో కాపాడుకుంటూ వచ్చిన జేపి అకస్మాత్తుగా మల్కాజ్ గిరిలో తన గెలుపు కోసం ఇతర పార్టీల పొత్తు కోసం ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మద్దతు కోసం ఆయన వెంపర్లాడారనీ, అలాగే జనసేన పార్టీ తెదేపా-భాజపా కూటమికి మద్దతు పలికిన నేపధ్యంలో ఆ కూటమి మద్దతు కూడా తనకు ఇవ్వాలంటూ పరోక్ష సంకేతాలు పంపినట్లు చెప్పుకుంటున్నారు.

సరే... లోక్ సత్తా గెలుపు కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఉంటే బావుండేది కానీ, కేవలం మల్కాజ్ గిరి స్థానం... అంటే తను పోటీ చేసిన స్థానం కోసమే మద్దతు కోరడం స్వార్థం కాక ఏమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి జేపీపై వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడతారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu