రజనీ కాంత్, మోడీకి మద్దతిస్తారా?
, శనివారం, 12 ఏప్రియల్ 2014 (18:02 IST)
ప్రతీ ఎన్నికల సమయంలో హాట్ టాపిక్‌గా నిలిచే తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈసారి కూడా తమిళనాట హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలవనున్నారని సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉండే రజనీ ఆదివారం మోడీని కలవనున్నారు. ఆదివారం చెన్నైలోని జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రజనీ ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం.ఎప్పుడూ ఏ పార్టీకి గానీ, నాయకుడికి గాని మద్దతు ఇవ్వని రజనీకాంత్ తాజాగా మోడీకి మద్దతిస్తున్నాడన్న వార్తలపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఇటీవల రజనీని కరుణానిధి కుమారుడు స్టాలిన్ కలిశారు. అదే విధంగా డీఎమ్‌డీకే అధినేత విజయ్ కుమార్ కూడా కలిసినట్లు సమాచారం. కానీ ఎవరికీ ఆయన మద్దతు ప్రకటించలేదు. అయితే తాజాగా మోడీతో భేటీ వెనుక అసలు కారణాలేంటనేది తెలియరాలేదు. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి సినీహీరోలు పవన్ కల్యాణ్, నాగార్జునలు మోడీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.