మోడీ కోసం భార్య ఉపవాసం... ఆయన నా భర్త కాకపోతే మీరెందుకు వస్తారు...?
, శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (12:02 IST)
భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి, దేశంలో శక్తివంతమైన నాయకుడుగా అవతరించిన నరేంద్ర మోడీ భార్య యశోదాబెన్ తన భర్తను ప్రధానమంత్రిగా చూడాలని గత 3 నెలలుగా ఉపవాస దీక్ష చేస్తున్నారట. నిజానికి ఇలాంటి విషయాలు చెప్పుకునేందుకు యశోద అంగీకరించరు, కానీ ఆమె సోదరుడు ఈ విషయాన్ని ఓ పత్రికకు వెల్లడించారు. అంతేకాదు, మోడీ తనను తన భార్యకు చెప్పుకుంటే చూడాలని ఆమె ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్నారట. ఎన్నికలు 2014 నేపధ్యంలో తన చిరకాల వాంఛ తీరిందనీ, తనకు ఇక ఏమీ అవసరం లేదని ఆమె వెల్లడించినట్లు సోదరుడు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పదవీ విరమణ చేసిన యశోద వయసు ఇపుడు 62 సంవత్సరాలు. 45
ఏళ్ల క్రితం మోడీ తనను విడిచిపెట్టి వెళ్లారనీ, ఆయన దేశం కోసం పుట్టిన వ్యక్తి అని, తనను విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు తనకేమీ బాధ లేదని యశోద చెపుతున్నారు. అలాగే ఆయన దేశానికి ప్రధానమంత్రి అయితే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరుగుతుందనీ, అంతటి ఉదాత్తమైన వ్యక్తి తనకు తెలిసి ఎవరూ లేరని యశోద సోదరుడు చెపుతున్నారు. తన సోదరి, మోడీ భార్య యశోద తన భర్త మోడీ ప్రధాని కావాలని ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకూ దైవ ప్రార్థనలో గడుపుతున్నట్లు ఆయన తెలిపారు. యశోద ఓ పత్రికతో మాట్లాడుతూ... మోడీ పేరు వచ్చినపుడల్లా ఇటీవల నా పేరు ప్రస్తావనకు వస్తోంది. ఆయనకు నేను భార్యను కావడం వల్లనే కదా. అంతెందుకు... ఇంతదూరం మీరు నన్ను వెతుక్కుంటూ రావడానికి కారణం కూడా అదే కదా అన్నారు.