Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరట్ లో నగ్మాకు విజయం దక్కేనా... వివాదాలతో నగ్మా ముందుకు...

Advertiesment
నగ్మా
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (18:23 IST)
FILE
నగ్మా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకు తెలుగు సినిమాలతోపాటు తమిళ, భోజ్‌పూరి, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమైంది. రాజకీయ నాయకురాలు అవతారమెత్తిన దగ్గర్నుంచి నగ్మా పలు వివాదాల్లో చిక్కుకుంది. అంతేకాదు... పలు అవమానాలతోపాటు వివాదస్పద సంఘటనల మధ్య గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు దూసుకెళుతోంది. ఆమె పోటీ చేస్తున్న మీరట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన భాజపా, బీఎస్పీ, ఎస్పీ కూడా సత్తా ఉన్న అభ్యర్థులను నిలబెట్టాయి. దీంతో నగ్మా గెలుపు అంత తేలిక ఏమీ కాదని తెలుస్తోంది. మరోవైపు మోడీ ప్రభంజనం కూడా తోడు కావడంతో ఆమె గెలుపు ఎంతమేరకు సాధ్యమన్నది అనుమానంగా ఉంది.

మరోవైపు నగ్మా మీరట్ లోక్ సభ పరిధిలో తాను పర్యటించేటపుడు ఒక యువకుడిని కొట్టానన్న వార్తపై వివరణ ఇస్తూ... తను అస్సలు ఎవర్నీ కొట్టలేదనీ, మీద పడుతున్న వారిని పక్కకు తోసినట్లు నగ్మా చెప్పుకొచ్చింది. ఓ ప్రజాప్రతినిధి తనను ముద్దు పెట్టుకున్నట్లుగా వచ్చిన వార్తలపై కూడా నగ్మా మాట్లాడుతూ... అది కూడా అబద్ధమని చెప్పింది. ఆయన తనకు ఏదో విషయం చెప్పబోయాడని వివరణ ఇచ్చింది.

కాగా నగ్మా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయనీ, అందువల్ల ఆమెకు ప్రత్యేకంగా భద్రత కల్పించాల్సిందిగా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ. నగ్మా ప్రచారం చేస్తున్నప్పుడు జన సందోహం భారీగా హాజరవుతున్నారనీ, ఆ సమయంలో కొంతమంది ఆకతాయిలు ఆమెను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అదేమోగానీ ముద్దు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకుడిపై ఇంతవరకూ చర్య ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ దీనికి బదులు ఏమి చెపుతుందో...?

Share this Story:

Follow Webdunia telugu