Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్కాజిగిరిలో ఏముంది.. అందరి దృష్టి దానిపైనే ఎందుకు!?

మల్కాజిగిరిలో ఏముంది.. అందరి దృష్టి దానిపైనే ఎందుకు!?
, సోమవారం, 7 ఏప్రియల్ 2014 (12:49 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా, అందరి దృష్టి కేవలం ఒక్క మల్కాజిగిరి స్థానంపైనే కేంద్రీకృతమైవుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకాక ముందు నుంచి ఈ స్థానం పేరును ప్రతి రాజకీయ నేత ఉచ్ఛరిస్తున్నారు. దీనికి కారణాలేంటో ఓసారి పరిశీలిద్ధాం...

దేశంలో ఉన్న అతిపెద్ద ఎంపీ సెగ్మెంట్లలో మల్కాజిగిరి ఒకటి. ఇక్కడ పట్టణ, మధ్యతరగతి ఒటర్లు అత్యధిక సంఖ్యలో నివశిస్తున్నారు. ముఖ్యంగా విద్యాధికులు ఎక్కువే. అదీ కాక ఇక్కడ సీమాంధ్ర ప్రాతానికి చెందిన సెటిలర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మల్కాజిగిరిలో 70 శాతం మంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారే కావడం విశేషం.

ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (రిజర్వుడ్), మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో దళితులు, క్రిష్టియన్లు ఎక్కువ సంఖ్యలో నివశిస్తున్నారు. దీంతో మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జయాపజయాలను సెటిలర్లతో పాటు.. దళితులు, క్రిస్టియన్ ఓటర్లు నిర్ణయిస్తారు.

వీరితో పాటు.. రెడ్డి, కమ్మ వర్గీయులు 20 శాతం మంది ఉండగా, బ్రాహ్మణులు 80 శాతం మంది ఇక్కడే ఉన్నారు. వీళ్లు ప్రధానంగా మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నారు. దళితులు, క్రిష్టియన్లు సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ఉన్నారు. ముస్లిం ఓటర్లు కూడా 50 శాతం మంది ఉన్నారు.

దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధంలేని వ్యక్తిగా ఉండాలి. అలాగే, సీమాంధ్ర నేతలతో సత్సంబంధాలు కలిగిని వారు మాత్రమే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. అందువల్లే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu