బాలకృష్ణ 2014 ఎన్నికల్లో పోటీ... బాబు బావను అడిగి చెపుతా
, మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (12:41 IST)
తెదేపా వియ్యంకుడు, నట సింహం బాలకృష్ణ 2014 ఎన్నికలలో పోటీసేచేందుకు ఉత్సాహంగా ఉన్నారన్న వార్తలు నేపధ్యంలో బాలయ్య పోటీ చేయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాక 2014 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇస్తానని లెజెండ్ బాలయ్య చెప్పుకొచ్చారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సక్సెస్ దిశగా వెళుతుండటంతో ఆయన మంగళవారం ఉదయం అప్పన్నను దర్శించుకుని పూజలు చేశారు. ఇంకా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నందమూరి తారక రామారావుగారి ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందన్నారు. అయితే, పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ... సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు.