పవన్ కళ్యాణ్ 15న కర్ణాటలో ఎన్నికల ప్రచారం!
, సోమవారం, 14 ఏప్రియల్ 2014 (17:46 IST)
కర్ణాటకలో భారతీయ జనతాపార్టీకి ఎన్నికల ప్రచారం చేయడానికి హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. మంగళవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కర్ణాటకలో మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. దీనికోసం భారతీయ జనతాపార్టీ ఒక హెలికాఫ్టర్‌ను సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 9 నుంచి 11 వరకు రాయచూర్, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు కోలార్, 3.30 నుంచి సాయంత్ర 5 గంటల వరకు గురుమిడ్కల్‌లో ప్రచారం చేయనున్నారు. పవన్ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కార్యాలయం సమన్వయం చేస్తోంది. అంతేకాకుండా, పవన్ పర్యటన కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరుతారు.